J.SURENDER KUMAR,
హైదరాబాద్ లోని శ్రీ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయాన్ని శుక్రవారం జరిగిన బోనాల ఉత్సవాలలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తో కలిసి పాల్గొని స అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల జాతర ఉత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులను ఆలయ నిర్వహకులు ఘనంగా డప్పులతో స్వాగతించారు. మంత్రులు ఆలయ పరిసరాలను సందర్శించి, భక్తులతో మాట్లాడారు.

ఉత్సవానికి హాజరైన వారందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, భద్రతలతో బోనాల ఉత్సవాన్ని నిర్వహించిన నిర్వాహకులను మంత్రులు ప్రశంసించారు.

పురాతన సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం రాష్ట్రం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా మంగళవాయిద్యాలతో మారుమోగింది.
–