ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి !

👉 వన మహోత్సవం నాటి మొక్కల సంరక్షణ తీసుకోవడం మనందరి బాధ్యత.!

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !

J.SURENDER KUMAR,

జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానంలో ఉండాలని. కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు.

ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు పనులు లను ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు  లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని సెక్టర్ ఆఫీసర్లకు  అధికారులకు సూచించారు. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్దిదారులను కలిసి, వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు.

నిర్దేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను ఇంటి నిర్మాణా పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని, వివిధ దశలను అనుసరిస్తూ వెంటదివెంట డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని అన్నారు.

వన మహోత్సవం లో భాగంగా అధికారులుపూర్తి బాధ్యత తీసుకోవాల మొక్కలు నాటడం ఎంత గొప్పదో  సంరక్షించడం అందరి అందరి బాధ్యత అని అధికారులకు సూచించారు.
మొక్కలు నాటడం కొరకు  పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు  కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆదన కలెక్టర్ బిఎస్ లత, పిడి డి ఆర్ డి ఏ  రఘువరన్, హౌసింగ్ డి ఈ  భాస్కర్ డిపిఓ మదన్మోహన్ ఎంపీడీవోలు  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.