ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J . SURENDER KUMAR,

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదవారి ఇంటి కల నిజం చేసే ఇందిరమ్మ  మోడల్ ఇల్లును ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం సైదాపూర్ గ్రామంలో  ఇందిరమ్మ మోడల్ ఇల్లును స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి మంత్రి  లక్ష్మణ్ కుమార్, ప్రారంభిస్తూ ప్రజాపాలనలో పేదల కల సహకారం అవుతుంది అన్నారు.

👉 ఆర్ అండ్ బి భవనం ప్రారంభం !

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి నల్గొండ జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి  నూతన రోడ్లు భవనాల కార్యాలయాన్ని ( R&B ) మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.