జగిత్యాల జర్నలిస్టు ఎన్నికల్లో హోరాహోరి పోరులో..

👉 మరోసారి చీటీ శ్రీనివాసరావు అధ్యక్షుడిగా ఎన్నిక!

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన టియూడబ్ల్యూజే (ఐ జే యు ) జర్నలిస్ట్ యూనియన్ మూడవ మహాసభ అనంతరం హోరాహోరీగా  ఎన్నికలు జరిగాయి. రెండవసారి సైతం జిల్లా అధ్యక్షుడిగా మెజార్టీ ఓట్లతో చీటీ శ్రీనివాసరావు,విజయం సాధించారు.

జిల్లా కేంద్రంలోని  సుమంగళి ఫంక్షన్ హాల్ లో బుధవారం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగింది. జిల్లా మొత్తం లో 523 మంది జర్నలిస్టులు సభ్యత్వం కలిగి ఉన్నారు. 454 మంది జర్నలిస్టులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొమ్మిది రౌండ్ లో. లెక్కింపును ఎన్నికల అధికారి రవీందర్, పరిశీలకులు సంపత్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ నిర్వహించారు

👉 అధ్యక్షుడిగా, చీటీ శ్రీనివాసరావు (262) 73 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

👉 ప్రధాన కార్యదర్శి , బెజ్జంకి సంపూర్ణ చారి (196) 90 ఓట్ల మెజార్టీ సాధించారు.

👉 కోశాధికారి , సిరిసిల్ల వేణుగోపాల్ (243) 85 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

👉 ఉపాధ్యక్షులు.. (మూడు పదవులు)

గడల హరికృష్ణ 213 ఓట్లు సాధించారు.!


మహమ్మద్ హైదర్ అలీ 164 ఓట్లు సాధించారు.!


అల్లే రాము 151 ఓట్లు సాధించారు.  మెజార్టీ 4 ఓట్లు.
!

👉 సహాయ కార్యదర్శి .. (మూడు పదవులు)

చింతా నరేష్ 276 ఓట్లు , గుర్రం చంద్రశేఖర్ 253, బోరేపు రాజ్ కుమార్ 245 ఓట్లు  సాధించారు.
17 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 88.8% పోలింగ్ నమోదయింది.