J.SURENDER KUMAR,
మావోయిస్టు కీలక నేతలు సంజీవ్ ఆయన భార్య దీన గురువారం రాచకొండ సిపి సమక్షంలో లొంగి జనజీవన స్రవంతి లో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లొంగిన మావోయిస్టు కీలక నేత సంజీవ్ , జననాట్యమండలి వ్యవస్థాపకుడు గద్దర్ తో పాటు ఒకరు అని ప్రచారం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో . జననాట్యమండలి గూర్చి చక్కర్లు కొడుతున్నది.
👉 జననాట్యమండలి ఏర్పాటు గూర్చి…
1972లో నరసింగరావు, గద్దర్ కలిసి సుమారు ఇరవై మంది సభ్యులతో హైదరాబాదులో జననాట్యమండలిని స్థాపించారు.
దివాకర్, సంజీవ్, ఈవీ, రాజనర్సు, డప్పు రమేష్, ఏసన్న మొదలైనవారు జననాట్యమండలిలో ముఖ్యమైన కళాకారులు, గాయకులు.

జననాట్యమండలి ఒక ప్రగతిశీల సాంస్కృతిక సంస్థ.
1979 నుండి, “గ్రామాలకు తరలండి” అనే నినాదంతో గ్రామాలకు విస్తరించింది. ఈ సంస్థ భావజాలం, రచనల సందేశాన్ని కళారూపాలుగా మలచి ప్రచారం చేసింది.
జిల్లాలో అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రను వీధినాటికగా మలిచి ప్రదర్శించింది.
దళిత, ఆదివాసుల హక్కుల రక్షణ కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం ప్రచార జాతాలను నిర్వహించింది..
జన నాట్య మండలి ఒక ప్రముఖ విప్లవాత్మక సాంస్కృతిక సంస్థ. ఇది నిషేధించబడ్డ సీ.పీ ఐ. (మావోయిస్ట్)కు చెందినది. ఇది మొదట హైదరాబాదు నగరంలో కేంద్రీక్రుతం అవ్వగా, 1979లో చేపట్టిన గ్రామాలకు తరలండి అనే నినాదంతో గ్రామాలకు విస్తరించింది

ఉత్తర తెలంగాణలో జన నాట్య మండలి తెచ్చిన చైతన్యం అంతా ఇంతా కాదు.. ప్రతి పాట కి ఆదరణ… గుండెల్లో నాటుకుపోయిన విప్లవ గీతాలు ఎన్నో…మా భూమి.. రంగులకల…తర్వాతి క్రమంలో ఎర్రమల్లెలు నవోదయం విప్లవ శంఖం మహా ప్రస్థానం నేటి భారతం తొలిపొద్దు… ఇంకా చాలా…రామోజీరావు పీపుల్స్ ఎన్కౌంటర్ లో కూడా రెండు మూడు పాటలు అందులోనుండి తీసుకొని కొన్ని మార్పులు చేసినవే!
బతుకమ్మ పాట ఎలా బ్రతుకు చిత్రాన్ని చూపించిందో… జన నాట్యమండలి పాట కూడా అలాగే ప్రజల జీవన స్థితిగతులను కళ్ళకు కడుతూ పోరాటంతోనే బతుకులు బాగుపడతాయని ప్రజల్లో చైతన్యం నింపింది…దర్శకుడు టి.కృష్ణ , ఆర్ నారాయణమూర్తి, మాదాల రంగారావు ఇంకా వెలుగులోకి రాని సినిమాలను రూపొందించిన వారు కూడా జన నాట్య మండలి గీతాలను సినిమా పాటలుగా మలుచుకున్నారు. అంటూ ప్రచారం మాధ్యమాలలో పేర్కొన్నారు.

