👉 మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి!
J.SURENDER KUMAR,
వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగం సాంకేతికతతో వేగంగా వార్తల సేకరణ సులభం అవుతుంది తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి కే శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ…

తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు – మీడియా ధోరణులు, ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు.
👉 సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ….
ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఫ్యాక్టు చెక్, మొదలగునవి టెక్నికల్ గా ఏలా ఉపయోగించాలో జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు.
👉 సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ…
నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు.
👉 సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ…
సమాచార హక్కు చట్టం- 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు.

శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు,ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ పి.సి. వెంకటేశం, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.