👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మీడియా అనేది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే గొంతుకని, జర్నలిస్టుల రక్షణ,సంక్షేమం కోసం మా ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రం సుమంగళి గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా 3వ మహాసభ కు ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాదు నగరంలో వెయ్యి మందికి పైగా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా నిలిచిపోయింది మంత్రి అన్నారు.

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, హౌసింగ్ పథకాలు,గుర్తింపు కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లాలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో కలిసి వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగ్ రావు,మాజీ జెడ్పి చైర్పర్సన్ దావ వసంతం, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడవాల జ్యోతి, గిరి నాగభూషణం, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ .శేఖర్, మహారాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు గూడూరీ శ్రీనివాస్, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్ గౌడ్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. శ్రీనివాసరావు అధ్యక్షతన మహాసభ జరిగింది.
మహాసభ జిల్లాలోని వివిధ మండలాల నుండి దాదాపు 500 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.
