👉 టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరిట !
J.SURENDER KUMAR,
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరిట కళాకారులను మోసగించిన వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్ర అభిషేక్ (28) ను పోలీసులు అరెస్టు చేసే రిమాండ్ కు తరలించారు.
తిరుమలలోని ఆస్థాన మండపంలో “శ్రీనివాస కళార్చన” పేరుతో రెండు రోజుల నాట్య కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుకి చెందిన 93 కళాబృందాల నుండి ₹ 2,900 కళాకారులను నమ్మించి మోసం చేసి. వారి వద్ద నుండి మొత్తం ₹ 35 లక్షల వసూలు చేశాడు.

అభిషేక్, కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువలు వంటి సదుపాయాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చాడు.
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం పేరు అడ్డుపెట్టుకొని కళాకారులను మోసగిస్తున్న సమాచారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి తెలిసింది. ఈ మేరకు తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr. No.43/2025 u/s 316(2), 318(4) BNS ప్రకారం కేసు నమోదు చేశారు. తిరుమల DSP విజయశేఖర్ ఆధ్వర్యంలో I టౌన్ పోలీస్ స్ CI జి. విజయ కుమార్ , SI డి. రమేష్ బాబు మరియు సిబ్బంది ఈనెల 1న నిందితుడు అభిషేక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద ₹ 14 లక్షల స్వాధీనం పరుచుకొని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు.