కాలేశ్వరం స్వామి సన్నిధిలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో  స్వాగతం పలికారు.


మహేష్ కుమార్ గౌడ్  స్వామి వారికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు
శేష వస్త్రం, ప్రసాదం అందించారు.  అర్చక  స్వాములు, వేద పండితులు ఆశీర్వచనం చేశారు.