J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వివిధ సంక్షేమ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, ఆర్థిక సాయం, హాస్టల్ సౌకర్యాలు, మైనారిటీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకాలు, మరియు దివ్యాంగులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు.

ప్రతి విభాగానికి సంబంధించిన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను మంత్రి సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలని, మినహాయింపులు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు చేరాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
“ప్రభుత్వ సంకల్పం ఏ ఒక్క అర్హులైన వ్యక్తి కూడా సంక్షేమ పథకాల నుంచి మినహాయించబడకూడదు” ఒకటికి రెండుసార్లు అర్హుల జాబితాలను పరిశీలించండి, పొరపాటు జరిగితే సరిదిద్దండి, అంటూ అధికారులను మంత్రి కోరారు. సమీక్ష సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, ప్రత్యేక కార్యదర్శులు, మరియు సంబంధిత శాఖల ముఖ్యాధికారులు హాజరయ్యారు.
