కెసిఆర్ కు బీసీలపై ప్రేమ ఉంటే ఆ పార్టీ కి అధ్యక్షుడిగా చెయ్యాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ రాచరిక పాలనలో మేమే చక్రవర్తులు అంటూ విర్రవీగిన నాయకులు బీసీలకు, రైతులకు చేసింది ఏమిటి ?  కెసిఆర్ కు బీసీలపై ప్రేమ ఉంటే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలి అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాష్ట్ర మంత్రివర్గం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా గురువారం ధర్మపురి పట్టణంలోని SH గార్డెన్స్‌లో అభినందన సభ ఘనంగా జరిగింది.

ఈ సభలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,  ఎమ్మెల్సీ వెంకట్రావు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, మాజీమంత్రి జీవన్ రెడ్డి, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..

దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేసే నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చూపుతోందని, మంత్రి అన్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ అడ్రస్ లేకుండా పోవడంతో పాటు కార్యకర్తలకు కూడా గమ్యం లేకుండా పోయారని పార్టీలో అధికారం కోసం లోపాయికారిగా పోరు కొనసాగుతోందని, ప్రజల సమస్యలపై పట్టింపు లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


  పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి చేసిన పనులు ఏమిటో చెప్పాలని, ఇప్పటి పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిందని, పార్టీలో వ్యక్తిగత కోపాలు, ఫిరాయింపులకు చోటు ఉండకూడదని, ఇతర పార్టీలు మనలో ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నిస్తున్నాయని, కార్యకర్తలు వారి అపోహలకు గురి కాకుండా పార్టీ పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో బిసి సామాజిక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.