ఖిలవనపర్తిలో క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు !

👉 కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులను మంత్రి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు !

J.SURENDER KUMAR,

ధర్మారం మండల ఖిలవనపర్తి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఆ పార్టీ తాజా మాజీ సర్పంచి సాగంటితార  భర్త సాగంటి కొండయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు గురువారం ధర్మారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ  కండువాను కప్పి  పార్టీలోకి స్వాగతించారు.

కాంగ్రెస్ పార్టీ పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు మంత్రి ఎలక్షన్ కుమార్ కు వివరించారు. 

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలాన్ని రాహుల్ గాంధీ ఆలోచన విధానాల నుండి పుట్టుకొచ్చినవేనని, అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఏ రాష్ట్రంలో నైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసిందా ? అని, మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిని సాధ్యం చేసి చూపించిందని మంత్రి అన్నారు.