👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూరగాయల విక్రయదారులకు, (రైతులకు) కొనుగోలుదారులకు అందుబాటులో ఉండాలి అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్ ను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మార్కెట్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధాకరమనీ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 మార్కెట్ షెడ్లలో నిర్మించిన సిమెంట్ గద్దెలు ఎత్తుగా వుండడంతో అమ్మకాలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు, కూరగాయల వ్యాపారులు తన దృష్టికి తెచ్చారని మంత్రి అన్నారు.
👉 మున్సిపల్ శాఖ అధికారులు, స్థానిక రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూరగాయల వ్యాపారులు రైతులతో మంత్రి మాట్లాడుతూ మీకు అనుకూలంగా మార్పులు చేర్పుల గూర్చి అధికారులకు వివరించండి అని అన్నారు.

👉 గత ప్రభుత్వ పెద్దలు తలాపున గోదావరి ఉన్న పట్టణంలో తాగునీటిని సరఫరా చేయడంలో విఫలమయ్యారని, రాబోయే రోజుల్లో పట్టణంలో శాశ్వత మంచినీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని,
👉 అమృత్ పథకంలో భాగంగా మార్కెట్ అవరణతో పాటు, మాతశిశు హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల కూడా వేగంగా కొనసాగుతున్నాయని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని, బోల్ చెరువుతోపాటు,అమృత్ పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేయడంతోపాటు, అక్కపెళ్లి చెరువు రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.