లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వచ్చిందంటే మనందరికీ పదవులు వచ్చినట్టే !

👉 బిసి అభినందన సభలోఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ !


J.SURENDER KUMAR,

సామాన్య కార్యకర్త కాంగ్రెస్ జెండా పట్టుకొని పోటీ చేస్తూ, ఓడిపోతూ గెలిచిన పోరాట యోధుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందంటే మనందరికీ పదవులు వచ్చాయి అనే సంతోషం అనిపిస్తున్నదని, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.


👉 బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో  42 శాతం రిజర్వేషన్లు  కల్పించిన సందర్భంగా ధర్మపురి నియోజకవర్గం కేంద్రంలో ఎస్ హెచ్ ఫంక్షన్ హాల్  లో గురువారం ఏర్పాటుచేసిన సీఎం రేవంత్ రెడ్డి  అభినందన  సభలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్, నేను ప్రజాక్షేత్రంలో గెలిచామని, కెసిఆర్ నన్ను లక్ష్మణ్ కుమార్ ను ఓడించారని అన్నారు. కెసిఆర్ కు పోరాటం చేసే వాళ్ళు, ప్రశ్నించేవాళ్లు సభలో ఉండవద్దని ఇలా మమ్మల్ని వాళ్లు ఓడించారు అయినా లక్ష్మణ్ కుమార్ ,  ధర్మపురి ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్నారని అని ఎమ్మెల్సీ దయాకర్ అన్నారు.

👉 పెద్దలు జీవన్ రెడ్డి జగిత్యాల నాయకుడు కాదని కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కు అని వారికి అత్యున్నత సముచిత స్థానం కల్పించడానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమాలోచన చేస్తున్నదని అద్దంకి దయాకర్ అన్నారు.

👉 70 సంవత్సరాల కాలంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి దక్కదని అది కేవలం సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్సీ దయాకర్ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, కులగణన రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ, వందల యూనిట్ల విద్యుత్తు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు రేషన్ కార్డుల పంపిణీ కి, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ మీ ప్రభుత్వంలో చేశారా ? అంటూ  కెసిఆర్ ను అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.

👉 సభలో పాల్గొన్న కాంగ్రెస్ సోదరులు, మీరు సర్పంచ్ లు అవుతారా ? ఎంపీటీసీలు అవుతారా ? ఎంపీపీలవుతారా ? జెడ్పిటిసిలవుతారా ? చైర్మన్ అవుతారా ? అనేది మీ ఇష్టం, మిమ్మల్ని గెలిపించడం మా బాధ్యత అన్నారు.

👉 కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రకటనలు ప్రకటిస్తున్నారని, వాళ్లకు బీసీ ఆత్మగౌరవం లేదా ? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.

👉 బీసీ అభినందన సభ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద అనుమతి తీసుకున్నానని. ముందుగానే వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో పెద్దలు జీవన్ రెడ్డి బిసి రిజర్వేషన్ అభినందన కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని ఎమ్మెల్సీ అన్నారు. అభినందన సభకు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.