👉 జగిత్యాల జిల్లా అడిషనల్ సెషన్ జడ్జి నారాయణ సంచలన తీర్పు !
👉 మద్యం తాగి వాహనం నడిపి
తే కఠిన చర్యలు ఎస్పీ అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారకుడికి జగిత్యాల జిల్లా అడిషనల్ సెషన్ జడ్జి నారాయణ ,నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹ 11 జరిమానా. అందిస్తూ బుధవారం సంచలన తీర్పు ఇచ్చారు.
👉వివరాలు ఇలా ఉన్నాయి..
నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ జూన్ 2022 న అతని స్నేహితులైన పల్లికొండ రోహిత్, ప్రవీణ్ తో కలిసి ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి బైక్ పై వచ్చి పని ముగించుకుని వెళ్లే క్రమంలో పల్లికొండ రోహిత్ అతిగా మద్యం సేవించి తన స్నేహితులను బైక్ పై ఎక్కించుకొని ఆ జాగ్రత్తగా బైక్ నడపడంతో దోనూరు గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడగా మధ్యలో కూర్చున్న సునీల్ అనే వ్యక్తి తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుని తండ్రి అయిన పోచన్న ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ కిరణ్ కుమార్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం వాదనలు వినిపించగా సాక్షులను జడ్జ్ నారాయణ విచారించారు.
సంఘటన జరిగినప్పుడు నిందితుడు రోహిత్ కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం తో లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమాని అయిన పల్లికొండ మల్లేశం కు ₹ 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
👉 మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు ఎస్పీ అశోక్ కుమార్ !
మద్యం సేవించి వాహనం నడపడాని తీవ్రంగా పరిగణిస్తాo అని జగిత్యాల జిల్లా ఎస్ అశోక్ కుమార్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు, అజాగ్రత్త చర్య వలన వారే కాకుండా ఇతరుల ప్రాణాలు పోవటానికి కారకులవుతున్నారని ఎస్పీ అన్నారు.
కేసును పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాదారాలను, సాక్ష్యులను తగు రీతిలో కొర్టులో ప్రవేశ పెట్టి ,ఇట్టి శిక్ష పడటానిక కృషిచేసిన పీపీ మల్లేశం , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ , CMS ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ CMS కానిస్టేబుల్ రాజు, కిరణ్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ప్రత్యేకంగా అభినందించారు.