👉 మంత్రి శ్రీధర్ బాబు !
J SURENDER KUMAR,
మహిళలను ఆర్థికంగా అన్ని రంగాలలో బలోపేతం చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

మంథని లో శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా ఆధ్వర్యంలో మహిళ సంఘాలు ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు వివిధ రకాల ఉత్పత్తులను చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సకాల అందిస్తుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.