👉 యశోద ఆస్పత్రి బులెటిన్.
J SURENDER KUMAR,
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యుడు, సీనియర్ కన్సల్టెంట్-జనరల్ ఫిజిషియన్ డిఆర్ ఎంవి రావు ప్రకటించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
గురువారం సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు ఆయన సాధారణ బలహీనత గురించి పరీక్షలు చేయించుకున్నారు. ప్రాథమిక పరీక్షలలో అధిక రక్త చక్కెరలు మరియు తక్కువ సోడియం స్థాయిలు వెల్లడయ్యాయి, మిగతా అన్ని కీలక పరిమితులు సాధారణ పరిమితుల్లో ఉన్నాయి. డయాబెటిస్‌ను నియంత్రించడానికి మరియు సోడియం స్థాయిలను పెంచడానికి ఆయన కు వైద్య సేవ అందిస్తున్నట్టు ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాక్షించిచారు.