👉 పారదర్శకంగా హత్య కేసును దర్యాప్తు చేయిస్తా!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉 మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య !
J.SURENDER KUMAR,
దారుణ హత్యకు గురి అయిన సల్లూరి మల్లేశ్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వపరంగా భూమి కేటాయిస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావు పేట కు చెందిన సల్లూరి మల్లేశ్ ను ఈ నెల 17న కొందరు దారుణంగా హతమార్చారు. మల్లేష్ కుటుంబాన్ని
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ వెంకటయ్యతో కలిసి గురువారం మంత్రి అడ్లూరి పరమార్శించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

కుల పరంగా హత్యకు గురైని మల్లేశ్ కుటుంబానికి ప్రభుత్వ తరపున అన్ని విధాల ఆదుకునే విధంగా అన్ని చర్యలు తీకుంటాం, . నిందితులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వ పెద్దగా తను అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. , ప్రభుత్వం తరుపున ₹ 4 లక్షల ₹ 12 వేల ఐదు వందల చెక్కును అందించారు.
👉 కమీషన్ చైర్మన్ బుక్కి వెంకటయ్య మాట్లాడుతూ…

మనుకు స్వతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడిచిన కుల పరంగా హత్యలు జరగడం భాదకరం మల్లేష్ ది ముమ్మాటికి కుల దురహంకార హత్యే, నిందితులను కఠినంగా శిక్ష పడాలంటే, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని బదిలీ చేసి మరో అధికారితో దర్యాప్తూ జరిపించి నిందితులను శిక్షించాలని ఎస్పీకి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.
మృతుని కుటుంబానికి రక్షణగా ప్రభుత్వం, తాము అండగా ఉంటామని చైర్మన్ బుక్కి వెంకటయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీ.సత్యప్రసాద్, DSCDO రాజ్ కుమార్, ఆర్డీఒ పులి మధుసుదన్, కల సంఘాల నాయకులు, ఇతర అధికారులు ఉన్నారు.