👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్లికార్జున్ ఖర్గే దేశ రాజకీయాల్లో గొప్ప నాయకుడు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడుతున్న నేత. ఆయన నాయకత్వం ప్రతి కార్యకర్తకు ప్రేరణ అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్, కేక్ కట్ చేసి కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులకు పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
మల్లికార్జున్ ఖర్గే దేశ రాజకీయాల్లో గొప్ప నాయకుడు. బహుభాషా కోవిదుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడుతున్న నేత. ఆయన నాయకత్వం లో బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న సామాజిక న్యాయ ప్రభుత్వ పాలన త్వరలో ఏర్పడుతుందని మంత్రి ఎలక్ట్రాన్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.