J SURENDER KUMAR,
ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన దివ్యాంగులు కోడూరు నరేష్, కోడూరు సుధాకర్ లకు గురువారం వారి ఇంటికి వెళ్లి ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ట్రైసైకిల్స్ అందజేశారు.

వారం రోజుల క్రితం మంత్రి లక్ష్మణ్ కుమార్ జైన గ్రామ పర్యటనలో నరేష్, సుధాకర్ ట్రై సైకిళ్ల కోసం వేడుకున్నారు.
వారి దుస్థితిని చూసి స్పందించి మంత్రి లక్ష్మణ్ కుమార్ మీరు కోరిన విధంగా మీకు సాయం చేస్తానని, మీ ఇంటికి ట్రైసైకిల్స్ ఇస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టిన మంత్రి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగులు నరేష్, సుధాకర్ లకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తానని అన్నారు. దివ్యాంగుల నరేష్ సుధాకర్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
👉 దివ్యాంగులకు స్వయం ఉపాధి చెక్కుల పంపిణీ !

ధర్మపురి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం దివ్యాంగుల స్వయం ఉపాధి పథకానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
నియోజకవర్గానికి చెందిన 6గురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹ 50 వేలే చొప్పున మొత్తంగా ₹ 3 లక్షల విలువైన చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్ లబ్ధికారులకు అందించారు.
👉ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..

దివ్యాంగుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందినీ, వారు తమ జీవనోపాధికి స్వయం అభివృద్ధి కోసం ఈ పథకాల ఉద్దేశ్యమని, దివ్యాంగులు సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందనీ మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాధికారతకు దారితీసే పథంలో ముందుకెళ్లాలనీ, అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం వర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు , సంబంధిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
