J.SURENDER KUMAR,
గత 15 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై పడిలేచిన కెరటం, చట్టసభలలో ప్రజా ప్రతినిధి, క్యాబినెట్ మంత్రి లక్ష్మణ్ కుమార్ తీరే వేరుగా ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తున్నారు.
మంత్రి అనే అహంకారం, ధర్పం, హంగు, ఆర్భాటంకు ఆమడ దూరంగా నిరంతరం ధర్మపురి నియోజకవర్గ ప్రజాక్షేత్రంలో ఉంటూ పాలన కొనసాగిస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ తీరు ఇది !

ఎమ్మెల్యేగా విజయం సాధించిన, ప్రభుత్వ విప్ గా పదోన్నతి లభించిన, క్యాబినెట్ మంత్రి హోదా వరించిన ప్రజాక్షేత్రంలో ఆయన ప్రవర్తన మారలేదు అనేది చర్చ. నేను ఆలయానికి వచ్చిన ప్రతిసారి మేళ తాళాలు, పూల దండలు వేయడం, పూర్ణకుంభ స్వాగతలకు స్వస్తి పలకండి, అంటూ ధర్మపురి ఆలయ అధికారులను పలుసార్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించిన తీరు ఇందుకు నీదర్శనం.

నియోజకవర్గ ఎండపల్లి, వెల్గటూర్ , గొల్లపల్లి . పర్యటనలో పోలీస్ వలయాన్ని దాటి తన దగ్గరకు రాలేని దివ్యాంగుల వద్దకే మంత్రి వెళ్లి వారి సమస్యను తెలుసుకొని ఎలక్ట్రిక్ స్కూటర్లు, ట్రై సైకిళ్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలను వారం రోజులలోనే వారికి అందిస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ తీరు పై ప్రజలు ప్రశంసిస్తున్నారు.

నియోజకవర్గ పర్యటనలలో గ్రామాలలో సామాన్యుల టీ కొట్టు లో టీ తాగుతూ, అక్కడి కి వారితో మాట ముచ్చట సమస్యలు అడిగి తెలుసుకోవడం మంత్రి లక్ష్మణ్ కుమార్ , నిరాడంబరకు నిదర్శనంగా జనంలో చర్చ.

ప్రత్యేకంగా, మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఉద్యోగులకు ఇచ్చే హామీలను గుర్తుంచుకొని నెరవేర్చే నైజం మంత్రి లక్ష్మణ్ కుమార్ ది. ధర్మపురి లో మంత్రి అందుబాటులో ఉంటే ఆయన క్యాంపు కార్యాలయం ప్రజా దర్బారే, సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన వారి సమక్షంలోనే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాల్సిందిగా ఆదేశించడం జగమెరిగిన సత్యం.

గొల్లపల్లి, పెగడపల్లి, ఎండపెళ్లి, ధర్మపురి మండలాలలో ట్రై సైకిల్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వయంగా వారి వద్దకే వెళ్లి ఇవ్వడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


👉 ధర్మపురి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేను !
పది రూపాయలు లేని నన్ను, ఎన్నికలలో ప్రజలు ఆశీర్వదించి, గెలిపించి చట్టసభలకు ఎమ్మెల్యేగా పంపిన ధర్మపురి నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిదని పలు సందర్భాల్లో, పలు సమావేశాల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పదేపదే అనే మాటలు.

అర్ధాంతంగా వచ్చి పోయే పదవుల, హోదాల కన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించే అదృష్టం కల్పించిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అనుగ్రహం, ఆశీస్సులు ఉన్నంతకాలం తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు సాగు, తాగు నీటి సమస్యలు విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తూనే ఉంటానని నేను పాలకుడును కాదు, ప్రజా సేవకుడ ను అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అంటారు.

