J SURENDER KUMAR,
హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం సిక్కు మత పెద్దలు ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ సిక్కు మత పెద్దలతో పళ్ళు అంశాలపై చర్చించారు. తమకు ప్రభుత్వ పరంగా అందాల్సిన చేయూత, తదితర అంశాలు మంత్రికి వారు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ లైన సిక్కుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సిక్కుల సంక్షేమ విషయంలో ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లక్ష్మణ్ వారికి హామీ ఇచ్చారు.