మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కలసిన మందకృష్ణ మాదిగ !

J. SURENDER KUMAR,

మాదిగ పోరాట సమితి వ్యవస్థాపకుడు పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ  హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం దివ్యాంగులతో కలిసి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా  దివ్యాంగుల సమస్యల పై మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.



సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి  వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.