మంత్రి సీతక్క పై మావోయిస్టు పార్టీ ప్రకటన చేయలేదు !

👉 మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ !

J.SURENDER KUMAR,

మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమి
టీ పేరుతో జూన్ 26న మంత్రి సీతకు పై వచ్చిన పత్రిక ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబధం లేదు.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సీసీ.
అధికార ప్రతినిధి జగన్ ప్రకటనలో పేర్కొన్నారు.

జూన్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగిపోతున్నట్లు దిన పత్రికలలో, సోషల్ మీడియాలలో విస్తృత ప్రచారం చేసారు. మీడియా చేసిన ఈ ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదు. పోలీసులే కావాలని ఉద్దేశ పూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు

గతంలో కూడా దామోదర్ ఎన్కౌంటర్లలో చనిపోయినట్లు , లేదా లొంగిపోతున్నట్లు అనేక సార్లు ప్రచారం చేశారు. విప్లవ ప్రజలను గందరగోళ పరచడానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్పచారం కొనసాగుతోంది వివరించారు.

కేంద్ర (బీజేపీ) ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ కగార్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఎన్కౌంటర్ లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.


మావోయిస్టు పార్టీ సమస్య సామాజిక, రాజకీయ సమస్యని, అణిచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైనది కాదనీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే .

తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు. మాత్రం మావోయిస్టు పార్టీకి ప్రజలు ఎలాంటి సహకారాన్ని అందించకూడని, సహకరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టు పార్టీ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.


ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలలో అమాయక ఆదివాసి ప్రజలను పోలీస్ స్టేషన్ లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారు.  తెలంగాణ ప్రజలు గమనించాలని అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.