మత సామరస్యానికి  ప్రతిక మొహర్రం మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయి భాయి అంటూ  స్నేహ సంబంధాలతో జీవనం కొనసాగిస్తున్నారని
మొహర్రం పండుగ  మన మతసామరస్యానికి  ప్రత్యక్ష నిదర్శనం అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణం నంది చౌక్ వద్ద ఉన్న  పీర్లమసీదు లో శనివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పీరీలను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రంలో ఆలయం మసీదు పక్కపక్కనే ఉన్నాయని.

మన మతసామరస్యానికి ప్రత్యక్షం నిదర్శనం అని  ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి త్వరలో  ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందనున్నదని మంత్రి అన్నారు.