మీ – సేవలో మ్యారేజ్ సర్టిఫికెట్లు?



J.SURENDER KUMAR,

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం మీ-సేవల
విస్తరణలో  భాగంగా ఇకపై వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను వీటి లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం.


స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించింది. మీ-సేవ లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం తదితర వివరా లను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందవచ్చు.


దరఖాస్తులను సంబంధిత సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం 24 గంటల్లో పరిశీలిస్తుంది.  వివాహ ఫొటోలు, చిరునామా, వయసు ధ్రువీకరణ పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి  (ఎస్ఆర్) నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్ నేరుగా జారీ జారీ చేయనున్నట్టు సమాచారం.


ఈ మేరకు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్టు సమాచారం. సోమవారం రాత్రి సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్ర డిజిటల్ గవర్నెన్స్ లో కీలకం కానున్నది


ప్రస్తుతం మీ-సేవలో ఆర్టీఏ, పాన్, ఇసుక బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. టీ-ఫైబర్, ఆద నపు కియోస్కీలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయి.