మృతదేహం తరలింపుకు అంబులెన్స్ ఏర్పాటు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి తరలించడానికి  ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వంత ఖర్చులతో అంబులెన్స్ సౌకర్యం కల్పించారు.

వివరాలు ఇలా ఉన్నాయి !

ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన పసుల రాజన్న, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. సమాచారం తెలిసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ₹ 10 వేల ఆర్థిక సహాయం అందించారు. రాజన్న మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని  మృతదేహం స్వగ్రామం తరలించడానికి అంబులెన్స్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఏర్పాటు చేశారు.

👉 విద్యార్థిని త్రివేణికి మెరుగైన వైద్యం అందించండి !

అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని త్రివేణి కి మెరుగైన వైద్య సేవలు అందించండి అని మంత్రి లక్ష్మణ్ కుమార్  వైద్యులను కోరారు.


కుంటాల మండలం నేరడిగొండ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆత్రం త్రివేణి, ఆరోగ్య సమస్యతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమాచారం తెలిసిన మంత్రి హాస్పిటల్ కి చేరుకొని త్రివేణి  కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్రివేణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.