J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను అనారోగ్య బారిన పడిన వారిని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు.
👉 ధర్మపురి మండలం లో…

దమ్మన్నపేట గ్రామానికి చెందిన దూడ శైలజ రోడ్డు ప్రమాదంలో మృతి, ఆమె భర్త సతీష్ కు తీవ్ర గాయాలు కాగా వారిని పరామర్శించి ₹ 5వేల ఆర్థిక సహాయన్నీ అందించి ఓదార్చారు.

దోనుర్ గ్రామానికి చెందిన గొల్లెన రవి కుటుంబానికి ₹ 5వేల రూపాయలు ఆర్థిక సహాయన్నీ అందించి ఓదార్చారు.

జైన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్ తండ్రి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

ధర్మపురి పట్టణంలో మృతి చెందిన బండారి యువకుడి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.


👉 వెలుగటూర్ మండలం లో..

వెల్గటూర్ పట్టణానికి చెందిన గాజుల శ్రీనివాస్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు
👉 పెగడపల్లి మండలంలో….

మండలంలోని మద్ధులపల్లి గ్రామానికి చెందిన మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం అనిల్ గౌడ్ తల్లి గంగవ్వ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి గంగవ్వ చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.