మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గురువారం పరామర్శించి ఓదార్చారు.

👉 వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు నరేష్  తల్లిగారు ఇటీవల మృతి చెందింది మంత్రి  వారింటికి వెళ్లి పరామర్శించారు.


👉 ధర్మారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్ ఎంపీపీ మెడవేణి తిరుపతి  తండ్రి ఇటీవల మృతి చెందారు. మంత్రి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


👉 జూలపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అడిచర్ల రాజేశం తండ్రి ఓదెలు  అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.వారి కుటుంబాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.