నాడు మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు నేడు నెరవేర్చారు !

J. SURENDER KUMAR,

దివ్యాంగుడు మనోజ్ కు పది రోజుల క్రితం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని గుర్తు చేసుకుని అధికారులను అప్రమత్తం చేసి శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ నెరవేర్చారు.


👉 వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల 25న పెగడపెల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ వచ్చారు. ఈపర్యటనలో మద్దులపల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు మనోజ్ మంత్రి వద్దకు రావడానికి నడవలేక ఇబ్బంది పడ్డారు. మంత్రి మనోజ్ వద్దకు వచ్చి నీ సమస్య ఏమిటి అని అడిగారు. మనోజ్  రోదిస్తూ తాను
కాలేజీకి వెళ్లడానికి చాలా కష్టపడుతున్నానని నాకు స్కూటీని ఇప్పించమని వేడుకున్నాడు. స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ మనోజ్ సమక్షంలో సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వారం రోజులలో మనోజ్ కు మనము ఇదే గ్రామానికి వచ్చి ఇక్కడే అతడికి స్కూటీ అందించాలని ఆదేశించారు.

👉 గత నెల 25న మంత్రి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుడు మనోజ్ కు హామీ ఇస్తున్న దృశ్యం ( ఫైల్ ఫోటో)

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి శనివారం రాత్రి పెగడపల్లి మండలానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ , దివ్యాంగుడు మనోజ్ కు కలెక్టర్ తో కలిసి స్కూటీని బహుకరించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రుణపడి ఉంటా :

తాను కళాశాలకు వెళ్ళడానికి స్కూటీ లేక ఇబ్బంది పడుతున్న విషయం మంత్రికి విన్నవించగా వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ తన విద్య కొరకు ప్రత్యేక శ్రద్ధతో స్కూటిని బహుకరించిన మంత్రికి రుణపడి ఉంటాను అని మనోజ్  మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.