నల్గొండ జిల్లాలో సింహంలాంటి నాయకులు ఉన్నారు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సింహాలాంటి రాజకీయ నాయకులు ఉన్నారని, జిల్లాలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం తనవంతుగా అత్యధిక శాతం నిధులు కేటాయించి సంక్షేమానికి సహకరిస్తానని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ,జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

దేవరకొండ  నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో గల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆదివారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రసంగంలో పేర్కొన్నారు.


దేవరకొండ నియోజకవర్గంలో ఐటీడీఏ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిస్థితిని వివరించి మాట్లాడతానన్నారు. గిరిజన ప్రాంతాల అభి వృద్ధి, రోడ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.