నలుగురు దళితులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రభుత్వ ప్రజా పాలనలో నలుగురు దళితులకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుందని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బుధవారం  ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంతో కలిసి పాల్గొన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ కు మాదిగ కుల దండోరా నాయకులు, కార్యకర్తలు, మహిళా బతుకమ్మలతో ఘనంగా స్వాగతించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ రాచరిక పాలనలో దళిత చట్టసభల ప్రతినిధులకు  రాజకీయ పదోన్నతులు కల్పించకుండా ద్రోహం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది అని మంత్రి  ఆరోపించారు.
30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి శుభం కార్డు వేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, అని చట్టసభలలో వర్గీకరణ చేసిన ఘనత దేశంలో తెలంగాణకే చెందుతుందన్నారు. 

మాదిగ జాతి కి ఆత్మగౌరవ ప్రతీకగా మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందని అని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరిస్తూ, వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.