J SURENDER KUMAR,
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు, మరో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గురువారం ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దేవస్థానం పక్షాన వీరికి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆశీర్వచనం మంటపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ అందించారు.

దేవస్థానం వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.