J.SURENDER KUMAR,
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదివారం మంథని నియోజకవర్గంలో పర్యటన, కార్యక్రమం వివరాలు!
👉 ఉదయం 9-30 నిమిషాలకు మహాదేవపూర్ లోని ZPHS(గర్ల్స్ ) పాఠశాల లో హైదరాబాద్ GIVE NGO వారి ద్వారా 650 మంది విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా స్కూల్ షూస్, స్పోర్ట్స్ షూస్ అందజేయనున్నారు !
👉 ఉదయం 11-00కు BLM గార్డెన్స్ కమ్యూనిటీ హాలులో కాటారం, మహా ముత్తారం, మల్హర్ రావు, మహాదేవపూర్, పలిమెల మండలాల్లోని స్వయం సహాయక మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాల కింద ₹ 70 లక్షలు, భీమ కింద ₹ 74 లక్షల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేయనున్నారు !
👉 పగలు 12-30కు మహా ముత్తారంలోని ₹ 1 కోటి 20 లక్షలతో నూతనంగా నిర్వహించిన ఎంపీడీవో కార్యాలయం భవనాన్ని మరియు నూతన PACS భవనాన్ని ప్రారంభోత్సవం చేయమన్నారు !
👉 1-00 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహా ముత్తారంలో నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు !
👉 మధ్యాహ్నం 2-00లకు బోర్ల గూడెం నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన మరియు అంగన్వాడి నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు !