👉 కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కి లేఖ !
J.SURENDER KUMAR,
కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కి లేఖ రాశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.
👉 కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
👉 ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు.
👉 తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో కోరారు. తెలంగాణలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులు, స్థితిగతులు, పరిణామ క్రమంపైన సవివరంగా లేఖలో ప్రస్తావించారు.
👉 తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో తాజా పరిస్థితులు, పరిణామాలు, ఏపీ ఉల్లంఘనలు, ఉత్పన్నమైన సమస్యలు, భవిష్యత్తు ప్రమాదాలపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని లేఖలో కోరారు.
👉 కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
👉 తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది.
👉 ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ₹ 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది.
👉 కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.