👉 ఒడిశా లోని రాయగఢ జిల్లాలో
J.SURENDER KUMAR,
మేనత్త కొడుకుని వివాహం చేసుకోవడం ఆ ఊరిలో నేరం. అయినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ కారణంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కట్టుబాట్లు, సంస్కృతిని గౌరవించ కుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఆ నూతన జంటను గ్రామస్తులు నాగలికి కట్టి పొలం దున్నించి విచిత్రమైన శిక్ష విధించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడు. సాధారణంగా మేనత్త కొడుకుని పెళ్లి చేసుకోవడం సహజం అది చట్ట బద్దమే.

కానీ ఇలాంటి వివాహం ఆ ఊరిలో మాత్రం చెల్లదు. అక్కడి కట్టుబాట్లు, నియమాలు, సంస్కృతి ప్రకారం ఇలాంటి వివాహాలను గ్రామస్తులు అంగీకరించరు. అయితే వాళ్లిద్దరు మాత్రం ఒకర్నొకరు ప్రేమించుకోవడం వల్ల పెద్దలను, ఊరివాళ్లను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ ఇద్దరికీ నాగలికి చెరో వైపు కట్టి పొలం దున్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఒడిశా లోని రాయగఢ జిల్లా కంజమజీరా గ్రామంలో జరిగింది. ఆ యువతీయువకులు ఇద్దరూ చాలా దగ్గరివాళ్లే. ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడు. దీంతో వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆ నిర్ణయం గ్రామస్థులకు నచ్చలేదు. దీంతో ఆ ఇద్దరికీ నాగలికి చెరో వైపు కట్టి పొలం దున్నించారు. ఆ తర్వాత దేవాలయానికి తీసుకెళ్లి శుద్ధీకరణ కర్మలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
👉 ( వన్ ఇండియా సౌజన్యంతో )