నూతన దంపతులను నాగలికి కట్టి దున్నించారు !

👉 ఒడిశా లోని రాయగఢ జిల్లాలో

J.SURENDER KUMAR,

 ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ ఊరిలో నేరం. అయినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ కారణంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కట్టుబాట్లు, సంస్కృతిని గౌరవించ కుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఆ నూతన జంటను గ్రామస్తులు నాగలికి కట్టి పొలం దున్నించి విచిత్రమైన శిక్ష విధించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఒడిశాలో  రాయగడ జిల్లా కె.సింగు పూర్ సమితి కంచమజోడి గ్రామంలో చోటుచేసుకుంది.

యువకుడు ప్రేమించిన  యువతని వివాహం చేసుకో వాలని నిర్ణయించుకొని.. గ్రామపెద్దలకు చెప్పారు. అయితే యువతి.. యువకుడికి పిన్ని వరుస అవుతుందని వారు పెళ్లికి నిరాకరించారు. ఇరువురూ దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రేమను కొన సాగించిన వారు పెళ్లి చేసుకొని కలిసి మాట్లాడుకుంటుండగా గ్రామస్తులు చూశారు.


ఆదివాసీల సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామపెద్దలు శుక్రవారం వీరి భుజాలకు నాగలిని కట్టి కర్రలతో కొడుతూ దుక్కి దున్నించారు.


ఇద్దరిని గ్రామం నుంచి బహి ష్కరిస్తూ తీర్మానించారు.
ఇలాంటి వివాహం ఆ ఊరిలో మాత్రం చెల్లదు. అక్కడి కట్టుబాట్లు, నియమాలు, సంస్కృతి ప్రకారం ఇలాంటి వివాహాలను గ్రామస్తులు అంగీకరించరు.


👉 ( వన్ ఇండియా సౌజన్యంతో )