👉 మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ !
J.SURENDER KUMAR,
మీ బార్ అసోసియేషన్ కు వచ్చి న్యాయవాధులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని , నంది మేడారం కోర్టులో మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు దివ్యాంగుల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, న్యాయవాదులకు హామీ ఇచ్చారు.
ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నంది మేడారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు.
నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లింగారెడ్డి నూతన కార్యవర్గం సభ్యులు గా ఎన్నికైన న్యాయవాదులు నారా అశోక్ రెడ్డి, బొట్ల లక్ష్మీనర్సయ్య , నూనే సత్యనారాయణ , భీమారపు సంపత్ లను మంత్రి
సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
👉 మంత్రిని కలిసిన జగిత్యాల ఆర్టీసీ డిపో అద్దె బస్సుల యజమానుల నూతన సంఘం !

జగిత్యాల ఆర్టీసీ డిపో అద్దె బస్సుల యజమానుల సంఘం నూతన కమిటీ గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి. పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జగిత్యాల డిపో నూతన కమిటీకి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో అధ్యక్షులు ఎం. వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి చుక్క వేణుగోపాల్, ఉపాధ్యక్షులు శీలం సంతోష్ కుమార్, సంయుక్త కార్యదర్శి కాసం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి వాల్గొండ సురేష్, కార్యవర్గ సభ్యులు ముకుందు కొమురయ్య, రాచకొండ కుమారస్వామి, వేముల మహేష్, కొలగాని మహేందర్, కృష్ణ గౌడ్ ఉన్నారు.
👉 బస్సు ప్రారంభించిన మంత్రి !

గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో మల్లన్నపేట,శంకర్రావుపేట, వెంగలపూర్, నందిపల్లె మీదుగా నడిచే నూతన ఆర్టీసీ బస్సును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకులు,.అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ మల్లన్నపేట్ గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.