👉 పాటల ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు !
J.SURENDER KUMAR,
పాటల ప్రపంచంలో ఆయన కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సరిగమలు, సంగీత పాఠశాలలో అభ్యసించలేదు, స్వయంకృషి, నిరంతర సాధనలతో గాయకుడిగా గుర్తింపు పొందారు. సంగీత, సాహిత్య సాంప్రదాయాలకు నిలయమైన ధర్మపురికి చెందిన గుండీ జగదీశ్వర్ ది, ఉపాధ్యాయ వృత్తి, పాటలు పాడడం ఆయన ప్రవృత్తి, ఉపాధ్యాయుడిగా, గాయకుడిగా, సమన్యాయం చేస్తూ సవ్యసాచి గాయకుడు జగదీశ్వర్, వన్ మ్యాన్ ఆర్మీ అని ఆయన మిత్రబృందం, సంగీత ప్రియులలో చర్చ.
వివరాల్లోకి వెళితే..
గాయకుడు జగదీశ్వర్ రేడియో, T. V. గాయకుడిగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అవార్డులు, మూడు సార్లు బంగారు పతకాలు సాధించాడు. స్వర్గీయ ప్రముఖ సినీ గాయకులు, బాలసుబ్రహ్మణ్యం ప్రధాన భూమిక పోషించిన ETV లో పాడుతా తీయగా లో తన ప్రస్థానం ప్రారంభించి, మా T. V లొ పాడాలని ఉంది, జెమినీ TV నవరాగం అనే మ్యూజిక్ ప్రోగ్రాం లో, సెమీ ఫైనల్ కు వెళ్లాడు.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు కోటి, మాధవ పెద్ది సురేష్ , R. P. పాట్నాయక్ సంగీత కార్యక్రమాలలో గాయకుడిగా కొంతకాలం కొనసాగారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో దాదాపు 1600 సంగీత కార్యక్రమాలు తన ఆధ్వర్యంలో గాయకులతో నిర్వహించారు.
ఉత్తమ గాయకుడిగా, వివిధ కల్చరల్ ఆర్గనైజషన్ ల ద్వారా దాదాపు 120 అవార్డులు పొందారు. ప్రముఖ సినీ గాయకులు S. P. బాలసుబ్రహ్మణ్యం పేరిట మూడు అవార్డులు, ప్రముఖ సినీ గాయకులు ఘంటసాల పేరుట రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు.. తెలంగాణ రత్న, ప్రతిభా రత్న, ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు జాతీయ స్థాయిలో ఉత్తమకు గాయకుడిగా అవార్డు ప్రధాన చేశారు. అంతర్జాతీయ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో, గాయకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ వారు జగదీశ్వర్ చేస్తున్న సంగీత సేవ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు అప్పటి ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రధానం చేశారు.

శేషప్ప రచించిన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ శతకం, వినాయక భక్తి గీతాలు, రాముని భక్తి గీతాలు, ఆంజనేయ స్వామి వారి భక్తి గీతాలు, జానపద గజ్జెల రవళి తదితర పాటలు సిడి లో రికార్డు చేశారు. తెలుగు గాయకుల ప్రపంచంలో జగదీశ్వర్ నోట, జాలువారిన పాటలకు, ప్రత్యేకత, చిరస్థాయిగా సుస్థిర స్థానం ఉంటుందని చెప్పవచ్చు.