పాదయాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తుంది !

👉 జనహిత పాదయాత్ర లో మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

ఈ పాదయాత్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా పని చేస్తుంది ప్రజల ముంగిటకు పాలనను తీసుకురావాలనే లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా  ప్రభుత్వం పని చేస్తుంది అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్. (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ “జనహిత పాదయాత్ర”లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిగి లో గురువారం ప్రారంభమైన  జనహిత పాదయాత్ర  ప్రారంభోత్సవంలో  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు   మాట్లాడుతూ..

👉 ఇది కేవలం ఒక ప్రచార కార్యక్రమం కాదు, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించేందుకు ఒక గొప్ప అవకాశం. మా నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన నిరంతర పాదయాత్రే.


👉 అధికారంలో ఉండి పాదయాత్రలు చేయడమేంటని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి మా సమాధానం ఒక్కటే.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టాం.


👉 స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కదా అని ఈ పాదయాత్రను చేపట్టడం లేదు. ప్రజలంతా గమనించాలి. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎంత వరకు చేరుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకేం చేయాలి అని ప్రజలనే అడిగి తెలుసుకోవాలనేదే మా సంకల్పం.

👉 తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారమిచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము కానివ్వం. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాళా తీయించింది. అయినా… ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.

👉 మీ కోసం, రాష్ట్రం కోసం, పని చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ పాదయాత్ర వేదికగా తెలంగాణ ప్రజలను కోరుతున్నా. మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని  హామీ ఇస్తున్నా. అని మంత్రి శ్రీధర్ బాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.