పాలమూరు కు కేసీఆర్‌ చేసిందేంటి ? సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

తెలంగాణ వాదాన్ని గెలిపించాలంటే పాలమూరు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అలాంటి పాలమూరు గడ్డకు కేసీఆర్‌ చేసిందేంటి.?

నడిగడ్డకు వరదలు వచ్చినప్పుడు బాధితులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్‌ కుటుంబానికి చిన్నచూపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ధ్వజమెత్తారు.

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లపూర్, జటప్రోలులో ప్రతిపాదిత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా  జరిగిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.


కేసీఆర్‌ను పార్లమెంట్ కు పంపింది మేము కాదా.? కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్‌కు ఎందుకు దుఃఖం వస్తుంది.

ఎస్సీవర్గీకరణ చేసినందుకు నీకు దుఃఖం వచ్చిందా.?  కేసీఆర్‌ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా.?

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్‌ ఏం చేశారు.? –

రాసి పెట్టుకో మరో పది సంవత్సరాలు నేనే సీఎం అంటూ పరోక్షంగా మాజీ సీఎం కెసిఆర్ ను ఉద్దేశించి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అన్నారు.