పట్టదారుల వివరాలను పారదర్శకంగా విచారణ చేయాలి !

👉 సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులదే  బాధ్యత  బీర్పూర్ మండల పైలెట్ ప్రాజెక్టు కొమనపల్లి లో !

👉 వీడియో కాన్ఫరెన్స్ లోసిసిఎల్ఎ, కమిషనర్ లోకేష్  కుమార్ ,  సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు !


J.SURENDER KUMAR,

పట్టదారుల వివరాలను పారదర్శకంగా విచారణ  చేయాలి రెండు రోజుల్లో నివేదిక అందించాలి అని రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు ఆయా జిల్లా కలెక్టర్లనుఆదేశించారు.

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన (రీ-సర్వే) పై గురువారం రాష్ట్ర సిసిఎల్ఎ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్  నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), బీ ఎస్ లత ఆర్డీవో మధుసూదన్, ఏడి ఎస్ & ఎల్ ఆర్ ఎస్ బీర్పూర్ తహసీల్దార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..


అధికారులకు పలు, సూచనలు సలహాలు అందజేశారు. బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద (రీ-సర్వే)కు సంబంధించి తీసుకున్నామని తెలిపారు. రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలు ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ.  సర్వే సిబ్బందికి ఫీల్డ్ వెళ్ళి విచారణ జరిపి రిపోర్టు సమర్పించాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులు పూర్తి పారదర్శకంగా.. చట్టం ప్రకారం.. నిబంధనల మేరకు వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించినా అధికారులదే పూర్తి బాధ్యత అని.. ఇందుకు బాధ్యతయుతంగా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని కమిషనర్ పేర్కొన్నారు.