పవిత్ర స్థల గోడ నిర్మాణం కు భూమి పూజ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J. SURRENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా జరిగిన మైదానంలోని కళ్యాణ వేదిక ప్రాంత పవిత్ర స్థల ప్రహరీ గోడ నిర్మాణముకు మాత్రమే భూమి పూజ చేస్తున్నాను అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి క్షేత్రం సోమవారం గోదావరి నది తీరంలో గల శ్రీ మఠం మైదానంలో  ఇటీవల స్వామివారికి కళ్యాణం జరిగిన స్థలానికి ప్రహరీ నిర్మాణం కోసం  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


మార్చి మాసంలో జరిగిన స్వామి వారి బ్రహ్మోత్సవాలలో బ్రాహ్మణ సంఘ భవనం పక్కన గల శ్రీ మఠం  మైదానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం  నిర్వహించుటకు, పట్టణ ప్రజలు, వేద పండితులు, అర్చకులు, దేవాదాయ శాఖ కీలక అధికారుల ఏకగ్రీవ అభిప్రాయం మేరకే భక్తుల సౌలభ్యం కోసం స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు పేర్కొన్నారు.


శ్రీ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహా స్వాముల ను స్వయంగా కలిసి వారు ఇచ్చిన అనుమతి మేరకే ఈ స్థలంలో పశువులు ఇతర జంతువులు ఇతరులు సంచరిస్తూ కలుషితం చేయకుండా ఉండేందుకే ప్రహరీ ప్రేమిస్తున్నట్టు మంచి తెలిపారు.
స్వామివారి శ్రీవారి మఠం కు చెందిన భూమార్పిడి ప్రక్రియ అనంతరం శాశ్వత కళ్యాణమంటపా నిర్మాణం ప్రభుత్వ నిధులతో చేపట్టనున్నట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.