👉 ఎరువుల దుకాణం, ఆస్పత్రి, తాసిల్దార్ కార్యాలయంలో…
J SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసిల్దార్ కార్యాలయంను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శనివారం తనిఖీలు చేపట్టారు.
👉 ఏరువుల దుకాణంలో…

యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా పై యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన యూరియాను మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై మరియు వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను ఆదేశించారు.
👉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ.పి సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి ఫీవర్ రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఆవరణంలో పిచ్చి మొక్కలు ముండ్ల చెట్లు తొలగించి వెంటనే శానిటేషన్ చేపించాలని అధికారులకు సూచించారు.
👉 తహసిల్దార్ కార్యాలయంలో…

పెగడపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ తెలంగాణ ప్రభుత్వం గత నెల కిందట నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే ఆగస్టు నెల 14 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా మీ సేవా సర్టిఫికెట్లను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్లను ప్రజలకు అందించవలసిందిగా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, తహశీల్దార్ రవీందర్, ఎంపిఓ శ్రీకాంత్, పాక్స్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.