👉 కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, సమక్షంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న, మరియు చౌదరి ఆంకుభాయి, లొంగుబాటు !
J.SURENDER KUMAR,
నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు మంగళవారం రామగుండం కమిషనరేటు పోలీసుల ఎదుట ప్రభుత్వానికి లొంగిపోయారు.
👉 మావోయిస్టు సభ్యుల వివరములు !
ఆత్రం లచ్చన్న @ గోపన్న @ రాజప్ప S/o భీమయ్య, వయస్సు : 65 సం.లు, కులం : ST (మన్నె), n/o పారపెల్లి గ్రామం,కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM) / ఇంచార్జీ డివిజన్ టెక్నికల్ టీం, నార్త్ బస్తర్ DVC, ఛత్తీస్గఢ్.
1983 సంవత్సరంలో CPI (ML) PW లో దళ సభ్యుని చేరి చెన్నూర్ దళం లో పనిచేశాడు. 1988 సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు.
1989 సంవత్సరంలో చౌదరి ఆంకుభాయి @ అనితక్క ని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు.
2002 సంవత్సరంలో DCM గా పదోన్నతి పొంది తిరిగి DK SZC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యాడు. 2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇంచార్జ్ గా నియమించింది. 2023 సంవత్సరంలో ఇతనికి DK SZCM గా పదోన్నతి లభించింది.
ఆత్రం లచ్చన్న పై తెలంగాణ లోని వివిధ జిల్లాలలో 35 కేసులు ఉన్నాయి.

👉చౌదరి ఆంకుభాయి !
చౌదరి ఆంకుభాయి @ అనితక్క @ లక్ష్మి, w /o ఆత్రం లచ్చన్న @ గోపన్న, వయస్సు: 55 సంవత్సరాలు, కులం : BC (ఆరే) , n/o ఆగరగుడా గ్రామం, బెజ్జూర్ మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. DCM, డివిజన్ టెక్నికల్ టీం, నార్త్ బస్తర్ DVC, ఛత్తీస్గఢ్.
అనితక్క 1988 వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో CPI (ML) PW లో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్ దళం లో పనిచేసింది. సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది. 1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995 లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయింది.
2002 సంవత్సరంలో ACM గా పదోన్నతి పొంది తిరిగి DK SZC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్త తోపాటుగా బదిలీ అయ్యింది. 2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ DVC టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది. లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ DVC లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో DCM పనిచేస్తుంది. చౌదరి ఆంకుభాయి పై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో 14 కేసులు ఉన్నాయి.