ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ !

👉 దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో…. !

J.SURENDER KUMAR,

ప్రభుత్వ పాఠశాలలో ఐదు  వందల మంది విద్యార్థులకు దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ట్రస్ట్ చైర్మన్ దామెర రామ్ సుధాకర్ రావు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.


ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం, గొల్లపల్లి, వెలుగటూర్, మండలాలలోని తదితర పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. శుక్రవారం ధర్మపురి మండలం నేరెళ్ల  గ్రామంలో,  ధర్మపురి పట్టణంలో న్యూ హరిజన వాడ లోని  ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వఉపాధ్యాయులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 పరామర్శ !

ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన  గల్ఫ్ బాధితుడు ఎలిగేటి నాగరాజు  గత 15 రోజుల క్రితం దుబాయిలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది దామెర రామ్ సుధాకర్ రావు నాగరాజు ఇంటికి వెళ్లి  పరామర్శించారు.