👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఆయన పాలనలో సామాన్యులకు న్యాయాన్ని అందించిన ఆదర్శవంతమైన కాలం అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వర్గీయ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు మంగళవారం హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రైతు బీమా, ఉచిత విద్యుత్ లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి,” అని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వ విధానాలు వైఎస్సార్ చూపిన దిశలో కొనసాగుతున్నాయని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
“వైఎస్సార్ కలలు నెరవేర్చడమే మా బాధ్యత. ఆయన ప్రజాస్వామిక విలువల్ని, సంక్షేమ భావనను కొనసాగిస్తున్నాం,” అని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.