J SURENDER KUMAR,
రాష్ట్రంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ రాచరిక పాలనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి రాచరిక పాలనకు చమర గీతం పాడి తెలంగాణ ప్రజల పాలయ్యింది వాస్తవం, ప్రజాపాలననే వచ్చిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ బాబు జగ్జీవన్ భవన్ లో ఆదివారం తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజాపాలనొచ్చేరో…..తెలంగాణ ప్రజల పాలైందిరో ! తెలంగాణ ప్రజా పాలన పైన రూపొందించిన ఆడియో, వీడియో విడుదల కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రసంగించారు. గాయకులను, పాటల రచయితలను, ప్రశంసలతో పలువురు నాయకులు తమ ప్రసంగాలలో అభినందించారు.