ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాస్ రావు మృతి !



J SURENDER KUMAR,

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు, ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.


83 సంవత్సరాలు ఉన్న కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజా పరిస్థితి… విషమించడంతో.. మరణించినట్లు తెలుస్తోంది.

ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోటా శ్రీనివాసరావు మరణించారని సమాచారం.