J.SURENDER KUMAR,
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (53)మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఫిష్ వెంకట్ సినిమాల్లోకి రాక ముందు చేపల వ్యాపారంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వందకు పైగా చిత్రాల్లో నటించారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో సంభాషణలతో సినీప్రియులను అలరించారు.
ఆయనకు ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు తదితర హిట్ చిత్రాలు బాగా గుర్తింపు తెచ్చాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.